శ్రీ ఈ సభ లో పునీతులు ఎవరు? | Who are saints in catholic church in telugu

శ్రీ సభ లో పునీతులు ఎవరు?

శ్రీ  సభ లో పునీతులు  అంటే సాధారణమైన మానవులే.దేవుని చిత్తానికి లోబడి లోక వ్యామోహము లను విడనాడి దైవ ప్రేమలో పవిత్రమైన జీవితం జీవించినవారు.వారి పవిత్రమైన జీవితం ద్వారా దేవుని రక్షణ సందేశం వ్యాప్తికై వారి జీవితాలను దేవుని సేవకు సమర్పించుకున్నారు.

Who are saints in catholic church telugu



లోక వ్యామోహములను,  ఆశలను పరిత్యజించి దైవ ప్రేమలో క్రీస్తు ప్రభువు మార్గంలో నడిచిన వారు.వారు క్రీస్తు ప్రభువుని మార్గం అనుసరించి నందుకు అవమానాలు, హింసలు శ్రమలు కలిగాయి. అయినను వారు నమ్మిన విశ్వాసానికి కట్టుబడి ప్రభుని విడిచి పెట్టలేదు. శరీర సుఖాలను పరిత్యజించి పవిత్రముగా జీవించినవారు.
చాలామంది పునీతులు వారు నమ్ముకున్న విశ్వాసము కొరకు  తమ ప్రాణములను సైతం లెక్క చేయక వేద సాక్షిగా వీర మరణం పొందారు.
పునీతులు మరణించిన తరువాత పరలోకంలో ఉన్నారని మన కొరకు  మధ్యవర్తిత్వ ప్రార్థన చేస్తున్నారని తల్లి శ్రీ సభ విశ్వసిస్తుంది. ప్రభువు క్రీస్తు కోరుకున్న విధంగా మన ఆత్మీయ జీవితం జీవించుటకు పునీతులు మనకు ఆదర్శప్రాయం గా ఉన్నారు.
For more information please visit our YouTube channel

Post a Comment

0 Comments