శ్రీ సభ లో పునీతుల ఎంపిక ప్రక్రియ
- అతను ధర్మమార్గంలో పవిత్రమైన జీవితం జీవించాడా లేదా?
- వేద సాక్షి మరణం అయితే నిజముగా వేద సాక్షి మరణం పొందారా లేదా?
- దైవ ప్రేమతో తోటి వారికి మంచి పనులు చేశాడా లేదా?
Congregation for the causes of saints అనే బృందం ఈ నివేదికను మరొకసారి విచారిస్తుంది. అభ్యర్థి యొక్క మరణం వేద సాక్షి మరణం అయితే నిజంగా విశ్వాసం కోసం మరణించారా మరియు శ్రీ సభ కొరకుతన జీవితాన్ని అర్పించారా? దైవ ప్రేమ మరియు సోదర ప్రేమ తో జీవించారా? అనే విషయాలపై విచారణచేసి నిర్ధారించుకుని, Congregation for the causes of saints ఆమోదించిన తరువాత దైవ సేవకుడు లేదా దైవ సేవకురాలు గా (Servant Of God) పిలవబడతారు.
- విశ్వాసం
- నిరీక్షణ
- ప్రేమ
- వివేకము
- నీతి
- నిగ్రహం
- దృఢత్వం
పునీతులు పరలోకంలో ఉన్నారని శ్రీ సభ విశ్వసిస్తోంది. ఒక వ్యక్తిని పునీతుడు లేదా పునీతురాలుగా ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా వారి మధ్యవర్తిత్వ ప్రార్థనా ఫలితంగా మొత్తం రెండు అద్భుతాలు జరగవలసి ఉంటుంది. కానీ ఈ అద్భుతాలు దేవుడు చేసినవి మాత్రమే అభ్యర్థి స్వశక్తితో చేసినవి కావు. అభ్యర్థి తను నమ్ముకున్న విశ్వాసం కొరకు వేదసాక్షిగా మరణిస్తే ఆ వ్యక్తిని పునీతులుగా ప్రకటించడానికి మొదటి అద్భుతం జరగనవసరం లేదు. ఎందుకంటే వేదసాక్షిగా మరణం పొందిన వారు పరలోకంలో ఉన్నారని శ్రీ సభ నమ్ముతోంది.
ఈ స్వస్థత సంపూర్ణంగా ఉండాలి మరియు తక్షణం జరిగి ఉండాలి మరియు శాస్త్రీయంగా వివరించడానికి సాధ్యం కానిదిగా ఉండాలి. ఈ అద్భుతాన్ని మొదట స్వతంత్ర వైద్యుల బృందం చే శాస్త్రీయంగా వివరించలేనిదిగా ధ్రువీకరించాలి. వైద్యుల ధ్రువీకరణ తరువాత వేదాంతవేత్తల బృందం ఆ వ్యక్తిని ఆమోదించి తుది ఆమోదం కొరకు పోప్ గారి దగ్గరకు పంపబడుతుంది. పోప్ గారు ఆమోదించిన తర్వాత ఆ వ్యక్తి ధన్యులుగా (Blessed) పిలవబడతారు.
0 Comments