దివ్య కారుణ్య నాధుని యొక్క వాగ్దానాలు
1931 వ సంవత్సరంలో పునీత పౌస్టీన అమ్మగారికి ఏసుప్రభువు దివ్య కారుణ్య నాధుని రూపములో దర్శనమిచ్చారు. ఆ దర్శనంలో స్వయంగా ప్రభువే దివ్య కరుణ జపమాలను ప్రార్థించే విధానం మరియు దివ్య కారుణ్య నాధుని యొక్క యొక్క వాగ్దానాలు తెలియపరిచారు.
- దివ్య కరుణ జపమాల ప్రార్థించే వారికి నా కరుణ వారి జీవిత కాలమంత వారిని ఆవరించి ఉంటుంది.ముఖ్యంగా వారి మరణ సమయంలో నా కరుణ వారిపై కుమ్మరించి వారిని ప్రత్యేకంగా దీవిస్తాను.
- కఠినమైన పాపాత్ములు దివ్య కరుణ జపమాల ను ప్రార్థించినప్పుడు నేను వారి హృదయాలను శాంతితో నింపి వారి మరణ సమయము నందు వారిని సంతోష చిత్తులు గా చేస్తాను.
- మరణించే వ్యక్తి సమక్షంలో లేదా మరణించే వ్యక్తి కొరకు దివ్య కరుణ జపమాలను ప్రార్థించి నప్పుడు, చనిపోతున్న వ్యక్తికి మరియు తండ్రి దేవునికి మధ్యలో స్వయముగా నేను ఒక తీర్పరిగ గాక కరుణగల రక్షకుడిగా నిలబడి ప్రత్యేకంగా వారిని దీవించి మంచి మరణం దయ చేస్తాను.
- ఎవరైతే ఈ కరుణ జపమాలను ప్రార్ధిస్తారో వారి మరణ సమయమందు వారు నా యొక్క గొప్ప కరుణను పొందుకుంటారు.
- పాపాత్ముల రక్షణ యొక్క చివరి ఆశ గా గురువులు ఈ కరుణ జపమాలను ప్రార్థించమని సూచించాలి. ఎంత ఘోరమైన పాపి అయినను ఈ కరుణ జపమాలను ఒక్కసారి ప్రార్థిస్తే నా అనంతమైన కరుణ నుండి నా దయను పొందుకుంటారు. నా కరుణ యందు ఆశ్రయం ఉంచిన వారికి వారి ఊహకు అందని దీవెనలతో వారిని దీవించడం నా కోరిక.
- నా కరుణను ప్రకటించి, కీర్తించే గురువులకు అద్భుతమైన శక్తులను ఇస్తాను. వారు మాట్లాడే మాటలను అభిషేకిస్తాను. వారు ఎవరితో అయితే మాట్లాడతారో వారి హృదయాలను తాకుతాను.
- పాపాత్ముల మారుమనసు కొరకు ప్రార్థించే ప్రార్థన అంటే నాకు ఇష్టమైన ప్రార్థన. అటువంటి ప్రార్థన ఎల్లప్పుడూ ఆలకించబడుతుంది మరియు ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఉంటుంది.
- మూడు గంటల సమయంలో నా కరుణను ప్రత్యేకంగా పాపాత్ముల పై కుమ్మరిస్తాను. కొద్ది క్షణాలు నా శ్రమలలో భాగం అయ్యిముఖ్యంగా నా మరణ వేదన సమయంలో నన్ను అందరూ విడిచిపెట్టిన సందర్భం గురించి నాతో పాటు మీరు కూడా వేదనను అనుభవిస్తూ ధ్యానించండి. అలా ధ్యానం చేస్తూ విన్నవించే విన్నపాలను నేను తిరస్కరించను.
- నా కరుణ యొక్క గొప్పదనాన్ని ప్రకటించే ఆత్మలకు వారి మరణ సమయములో తీర్పు తీర్చక వారి యందు కరుణ గల రక్షకుడిగా ఉంటాను.
- ఎవరైతే దివ్య కారుణ్య నాధుని యొక్క యొక్క ఫోటోని పూజిస్తారో వారి ఆత్మ నాశనము చెందదని నేను వాగ్దానం ఇస్తున్నాను.దివ్య కారుణ్య నాధుని హృదయం నుండి వచ్చే రెండు కిరణాలు ఎరుపు మరియు నీలం రంగు రక్తం మరియు నీటకిి గుర్తు. సిలువపై ఉన్న నన్ను పొడిచినప్పుడు వేదన తో కూడిన నా హృదయం తెరువబడి అనంతమైన నా కరుణలో నుండి ఈ రెండు కిరణాలు వెలువడినవి. ఈ రెండు కిరణాలు పాపులను తండ్రి దేవుని కోపం నుండి కాపాడే రక్షణ కవచాలు.
- ఈస్టర్ పండుగ తర్వాత వచ్చే మొదటి ఆదివారాన్ని దివ్య కారుణ్య మహోత్సవంగా కొనియాడలని నా వాంఛ . ఎవరైతే ఈ ఆదివారం రోజున నా కరుణ యందు ఆశ్రయం ఉంచి మంచి పాప సంకీర్తన చేసి దివ్య సత్ప్రసాదం స్వీకరిస్తారో వారి యొక్క పాపము మరియు పాపపు శిక్షల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది.
- దివ్య కరుణ జపమాల ప్రార్థన లో నా చిత్తానికి లోబడి ఏమి అడిగాను అది ఇవ్వబడుతుంది.
For more information please visit our YouTube channel
0 Comments