పరిశుద్ధ జపమాల వాగ్దానాలు ౹ The promises of holy rosary in Telugu

పరిశుద్ధ జపమాల వాగ్దానాలు 

కతోలిక విశ్వాసులు పరిశుద్ధ దివ్యబలి పూజ తర్వాత అమితంగా ఇష్టపడే ప్రార్ధన జపమాల. ఈ జపమాల ప్రార్థన లో ఏసుప్రభు యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనలు ధ్యానం చేస్తాము. ఈ ప్రార్ధన యొక్క ముఖ్య ఉద్దేశం మన జీవితాలను ఏసుప్రభుని యొక్క జీవితానికి అనుసంధానించి జీవించడమే.



the 15 promises of the rosary 15 promises of the holy rosary explained who received the 15 promises of the rosary the 15 promises of the virgin mary 15 promises of the rosary pdf 15 promises of the rosary catholic answers promises of the rosary explained gifts of the holy rosary


పునీత డొమినిక్ గారు జపమాలను ప్రార్థించే వారికి పరిశుద్ధ మరియ తల్లి నుండి 15 వాగ్దానాలు స్వీకరించారు.

1. విశ్వాసం మరియు భక్తితో ఈ పరిశుద్ధ జపమాలను ధ్యానం చేసే వారందరికి
వారి జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి  గొప్ప కృప అనుగ్రహించబడుతుంది.
2 ఈ జపమాల ధ్యానించు వారందరికీ  నా యొక్క ప్రత్యేకమైన సంరక్షణ మరియు గొప్ప కృపను వాగ్దానం ఇస్తున్నాను.
3 జపమాల ప్రార్థన నరక శక్తులకు వ్యతిరేకంగా గొప్ప కవచంగా పనిచేస్తుంది. దుష్టత్వాన్ని నాశనం చేసి పాపాన్ని తగ్గిస్తుంది మరియు మత విరోధమైన సిద్ధాంతాలను  ఓడిస్తుంది.
4 జపమాలను ధ్యానించడం ద్వారా మనము సద్గుణాలు కలిగి మంచి పనులు చేయాలనే మనసు కలుగుతుంది. ఆత్మలకు అవసరమైన అపారమైన దేవుని యొక్క కరుణను పొందుకుంటాము. మానవుల హృదయాలను లోక ప్రేమ నుండి లోక ఆశల నుండి దూరం చేస్తుంది మరియు పరలోక సంబంధ విషయాల పట్ల ఆశను కలిగిస్తుంది. ఈ విధంగా ఆత్మలు తమను తాము పవిత్ర పరచుకుంటాయి.
5 జపమాల ప్రార్థన చేస్తూ నాయందు నమ్మిక ఉంచిన ఆత్మలు ఎన్నటికీ నాశనం కావు
6  ఎవరైతే ఈ జపమాలను భక్తితో పవిత్రమైన దేవ రహస్యలను  ధ్యానం చేస్తూ చెప్తారో వారికి ఎప్పటికీ అపజయం కలగదు.వారిని దేవుడు తన న్యాయమును అనుసరించి శిక్షించడు. సిద్ధపాటు లేని మరణం చేత నాశనము చెందరు. పాపాత్ములు మారుమనస్సు పొందుతారు. నీతిమంతులు దేవుని కృప లో పెరిగి నిత్యజీవానికి అర్హులు అవుతారు.
7 ఎవరైతే పరిశుద్ధ జపమాల పట్ల నిజమైన భక్తి కలిగి ఉన్నారో వారు శ్రీ సభ యొక్క దివ్య సంస్కారాలను స్వీకరించకుండా మరణించరు.
8 ఎవరైతే విశ్వాసంతో జపమాలను చెప్తారో వారి జీవిత కాలం ముందు మరియు వారి మరణ సమయము నందు దేవుని యొక్క అపారమైన కృప మరియు దేవుని యొక్క తేజస్సు కలిగి ఉంటారు. వారి మరణ సమయంలో వారు పరలోకంలో ఉన్న పునీతుల యొక్క యోగ్యతలో భాగం కలిగి ఉంటారు.
9 జపమాల పట్ల భక్తి కలిగి ఉన్న ఆత్మలను ఉత్తరించు స్థలము నుండి విడుదల కలిగిస్తాను
10 జపమాల పట్ల విశ్వాసపాత్రులుగా ఉన్న బిడ్డలకు పరలోకములో గొప్ప కీర్తిని పొందుకుంటారు.
11 నన్ను జపమాల ప్రార్థన ద్వారా మీరు అడిగినవి అన్ని ప్రసాదించ బడతాయి.
12  పరిశుద్ధ జపమాల ప్రార్థన ప్రచారం చేసే వారందరికీ వారి అవసరాలలో నా సహాయం ఉంటుంది.
13 విశ్వాసంతో జపమాలను ధ్యానించే వారికి వారి జీవిత కాలంలో మరియు మరణ సమయం లో దేవదూతలు మరియు పునీతుల సహవాసం ఉంటుంది
14 పరిశుద్ధ జపమాలను ధ్యానించే వారందరూ నా ప్రియమైన బిడ్డలుమరియు నా ఏకైక కుమారుని సోదరి సోదరులు
15 పరిశుద్ధ జపమాల పట్ల భక్తి కలిగి ఉండటం రక్షణ కు గొప్ప గుర్తు.


For more information please visit our YouTube channel


Post a Comment

0 Comments