దివ్య సత్ప్రసాద అద్భుతం - జార్జెన్‌బర్గ్-ఫిచ్ట్ (ఆస్ట్రియా)
ఈ దివ్య సత్ప్రసాద అద్భుతం 1310 వ సంత్సరములో ఆస్ట్రియా దేశములో ఉన్న ఇన్ valley లోని సెయింట్ జార్జెన్‌బర్గ్-ఫిచ్ట్ గ్రామంలో జరిగింది.
హత సాక్షులు అయినటువంటి పునీత జార్జ్ మరియు ఆపోస్తులుడైన పునీత జేమ్స్ దేవాలయం లో అబ్బొట్ రూపర్ట్ సమక్షము లో గురువు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. నడి పూజా సమయములో, ద్రాక్ష రసం అర్పించిన తరువాత, ద్రాక్ష రసము యొక్క గుణములలో నిజముగా క్రీస్తు ప్రభువు ని యొక్క రక్తము ఉందా?అనే శోధనకు గురువు లోనయ్యాడు.
ఒక్కసారిగా ద్రాక్ష రసం రక్తముగా మారి, మరుగుతూ చాలీస్ నుండి పొంగి పోర్లడం ప్రారంభం అయింది. ఇలా జరగడాన్ని అక్కడ ఉన్న అబ్బాట్ మరియు అతని శిష్యులు, గాయక బృందం, చాలా మంది భక్తులు అందరూ పీఠము దగ్గరకు వచ్చి చూశారు. పూజ సమర్పించిన గురువు ఇది చూసి చాలా భయపడ్డాడు, రక్తం గా మారిన ద్రాక్ష రాసాన్ని తాగలేక పోయాడు.
ఆ ద్రాక్ష రసాన్ని మందసము లో భద్రపరిచారు.
ఈ అద్భుతమైన వార్త చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలకు వ్యాపించి, అనేక మంది భక్తులు ఆ దివ్య రక్తాన్ని ఆరాధించడానికి వచ్చే వారు. ఈ విధంగా భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
170 సంవత్సరాల తరువాత అంటే 1480 వ సంవత్సరంలో ఆ పవిత్ర రక్తము అప్పుడే గాయం నుండి బయటకు వచ్చిన రక్తం వలె తాజాగా ఉంది. ఈ పవిత్ర రక్తము ఇప్పటికి కూడా సెయింట్ జార్జెన్‌బర్గ్ ఆశ్రమంలో భద్రపరిచారు.
1472 వ సంత్సరములో బిషప్ జార్జ్ వొన్ బ్రిక్సెన్ జరిగిన అద్భుతం పై శాస్త్రీయ మైన అధ్యనం జరిపించారు.
ఆ అధ్యయనంలో ద్రాక్ష రసం నిజంగా ప్రభుని రక్తం గా మారింది అని ధృవీకరించి అద్భుతాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆ దివ్య రక్తాన్ని ఆరాధించడాన్ని ప్రోత్సహించారు.
ప్రొటెస్టంట్ విభేదాల సమయంలోక్యాథలిక్ విశ్వాసాన్ని పరీక్షించడం లో ఈ దివ్య రక్తము ప్రముఖ పాత్ర వహించింది.
1593 వ సంత్సరములో Tyrol నగరంలో ప్రతి చోట క్యాథలిక్ విశ్వాసానికి విరుద్ధముగా లుతర్ యొక్క బోధనలు వ్యాపిస్తున్న కాలంలో, జార్జెన్‌బర్గ్ ఆశ్రమ monks ప్రతిచోట సువార్త ప్రచారం చేయాలని అనుకున్నారు.
Schwaz విచారణ చర్చలో పెద్ద జన సమూహము నకు అబ్బట్ Michael Geisser ప్రసంగిస్తూ ఉన్నారు. అప్పుడు బలి పీఠములో దివ్య మందసము లో నిజముగా క్రీస్తు ప్రభువు యొక్క సాన్నిధ్యము నకు ఋజువుగా రక్తం గా మారిన అద్భుతాన్ని గుర్తు చేశారు.
ఈ రీతిగా అతను విశ్వాసులు తమ విశ్వాసం కోల్పోకుండా అంటి పెట్టుకునే విధముగా బలముగా తన ప్రసగం కొనసాగించాడు దానితో క్యాథలిక్ విశ్వాసానికి విరుద్ధముగా ప్రచారం చేస్తున్న ప్రత్యర్థులు ఆ ప్రదేశం విడచి వెళ్లి పోయారు.
ప్రభువు అనుగ్రహించిన కృప ద్వారా తప్పుడు బోధనల పై విజయం సాధించడాన్ని అక్కడ ఉన్న వారు గమనించారు.
ఈ విధంగా ప్రభువు పవిత్రమైన రక్తాన్ని ఆరాధించే విశ్వాసుల పై ఆయన తన ప్రత్యేకమైన దీవెనలు కుమ్మరించాడు.
దివ్య బలి పూజ లో పాల్గొనే ప్రతిసారి ఏదో ఆశామాషీగా కాకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రభుని యొక్క శరీర రక్తములు, గోధుమ అప్పము మరియు ద్రాక్షారసం రూపములో ఉన్నాయని ఆయన సాన్నిద్యాన్ని గుర్తు ఎరిగి, యోగ్యమైన రీతిలో ఆయన శరీర రక్తములను మనమందరము స్వీకరించుటకు ప్రయత్నం చేయవలెను.
For more information please visit our YouTube channel
https://www.youtube.com/c/AveMaria35
0 Comments