దివ్య సత్ప్రసాద అద్భుతాలు అంటే ఏమిటి?
దివ్య సత్ప్రసాద అద్భుతాలు క్రీస్తు ప్రభుని యొక్క శరీర రక్తములు నిజముగా దివ్య సత్ప్రసాదములో ప్రత్యక్షమై ఉన్నాయనే మన విశ్వాసాన్ని బలపరుస్తాయి.
దివ్య బలి పూజ లో గురువు "ఇది నా శరీరము ఇది నా రక్తము" అని పలికినప్పుడు, గోధుమ అప్పము ప్రభుని శరీరముగా మరియు ద్రాక్ష రసము ప్రభుని రక్తముగా మారతాయి. గోధుమ అప్పము మరియు ద్రాక్ష రసము బాహ్యముగా కనిపిస్తున్నప్పటికీ, నిజమగా క్రీస్తు ప్రభువు శరీర రక్తములు అని శాస్త్రీయముగా నిరుపించాబడ్డాయి.
దివ్య సత్ప్రసాద అద్భుతాలు బ్లెస్సెడ్ కార్లో ఆక్కుటిస్ వెబ్సైటు నుండి సేకరించబడినవి.
దివ్య సత్ప్రసాద అద్భుతాలు - అర్జెంటీనా బెనోస్ ఐరిస్
అర్జెంటీనా దేశం లోని బెనోస్ ఐరిస్ నగరములో సెయింట్ మేరీ విచారణలో జరిగిన దివ్య సత్ప్రసాద అద్భుతాల గురించి తెలుసుకుందాము.
మే 1 1992 సంవత్సరంలో శుక్రవారం దివ్యబలిపూజ తరువాత దివ్య సత్ప్రసాదమును మందసములో భద్రపరిచే సమయములో
దివ్య సత్ప్రసాదమును యొక్క చిన్న చిన్న ముక్కలు దివ్య బలి పూజ వస్త్రము కార్పోరల్ పై గమనించారు.ఇటువంటి సందర్భంలో శ్రీ సభ నీరు ఉన్న పాత్రలో వాటిని పెట్టి దివ్య మందసములో బద్రపరచి అవి నీటిలో కరిగే వరకు వేచి ఉండాలని నిర్దేశిస్తుంది. కొన్ని రోజుల తరువాత కొంత మంది గురువులు వాటిని పరిశీలించారు, కాని వారికీ ఏ మార్పు కనిపించ లేదు. ఏడు రోజుల తరువాత మే 8 దివ్య మందసము తెరచి చుస్తే దివ్య సత్ప్రసాదము యొక్క చిన్న చిన్న ముక్కలు రక్తము వలే ఎరుపు రంగులోనికి మార్పు చెందాయి. తరువాత ఆదివారం రోజు మే 10
సాయంత్రం రెండు దివ్య బలి పూజలలో దివ్య సత్ప్రసాదము పంచే పాత్రలో చిన్న చిన్నరక్తపు చుక్కలను గమనించారు.
జూలై 24 1994 సంవత్సరంలో చిన్న పిల్లల దివ్యబలిపూజలో కూడా రక్తపు చుక్కలు గమనించారు.
ఆగష్టు 15 1996 సంవత్సరంలో మరియ తల్లి మోక్షరోపన పండుగ రోజు, దివ్య సత్ప్రసాదమును పంచే సమయములో అప్పము యొక్క చిన్న ముక్క కింద పడింది.
నీరు ఉన్న పాత్రలో వాటిని పెట్టి దివ్య మందసములో నీటిలో కరుగుటకు భద్రపరచారు. కొన్ని రోజుల తరువాత ఆగష్టు 26 న అవి రక్తముగా మారడాన్ని గమనించారు.
ఆగష్టు 15 1996 సంవత్సరంలో ఒక విశ్వాసి దివ్య సత్ప్రసాదమును చేతిలో స్వీకరించాడు కానీ అనుకోకుండా కింద పడిపోయింది. కింద పడిపోయిన దివ్య సత్ప్రసాదమును తీసుకోకుండా వదలివెళ్లిపోయాడు. కానీ ఇది గమనించిన మరొక భక్తి గల విశ్వాసి కింద పడిపోయిన దివ్య సత్ప్రసాదమును ఒక పక్కన పెట్టి, వెంటనే వెళ్లి గురువు కి తెలియ చేసాడు. గురువు వచ్చి నీరు ఉన్న పాత్రలో పెట్టి దివ్య మందసములో నీటిలో కరుగుటకు భద్రపరచారు.
ఆగష్టు 26 న దివ్య మందసములో భద్రపరచిన దివ్య సత్ప్రసాదము నీటిలో కరగకుండా రక్తములా ఎర్రగా మారి రోజురోజుకు పెద్దగా అవ్వడాన్ని గమనించారు.వెంటనే విచారణ గురువులు జరిగిన విషయాలు అన్ని అతిమేత్రానులవారికి తెలియపరచారు.
1999వ సంవత్సరంలో అప్పటి అతిమేత్రానులు అయినటువంటి పొప్ ఫ్రాన్సిస్ జరిగిన అద్భుతాల పైన శాస్త్రీయమైన పరిశోధన చేయుటకు ప్రొఫెసర్ రికార్డో కాస్తనోన్ గోమేజ్ ను పిలిపించారు.