రక్తం మరియు కన్నీరు ఏరులై పారుతుంది. యుద్ధం ఆపండి.- పొప్ ఫ్రాన్సిస్
వాటికన్ సిటీ :
ఉక్రెయిన్ దేశము పై రష్యా చేస్తున్న దాడులను పొప్ ఫ్రాన్సిస్ ఖండించారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి ఉక్రెయిన్ లో జరుగుతున్న క్రూరమైన చర్యలను ప్రపంచానికి తెలియపరుస్తున్న జర్నలిస్టుల కు కృతజ్ఞతలు తెలిపారు.
సెయింట్ పీటర్ స్క్వేర్ లో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ " రక్తం మరియు కన్నీరు ఏరులై పారుతుంది. ఇది కేవలం సైనిక చర్య కాదు, మరణము విధ్వంసం మరియ దుఃఖమునకు ఈ యుద్ధం దారి తీస్తుంది" అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉక్రెయిన్ మరియు రష్యా దేశముల మధ్య శాంతి స్థాపనకు చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కాథలిక్ లను ఇరు దేశాల శాంతి కొరకు ప్రార్థించమని కోరారు.
0 Comments