పంచ గాయాలు పొందిన పునీత పాదరే పియో గారి జీవితం | The life story of Saint Padre Pio (Stigmata Saint)

 పంచ గాయాలు పొందిన పునీత పాదరే పియో గారి జీవితం

పునీత పాదరే పియో చిన్ననాటి పేరు  Francesco Forgione మే 25, 1887 సంవత్సరంలో  దక్షిణ ఇటలీలోని pietrelcina  అనే చిన్న పట్టణంలో జన్మించారు. అతని తల్లిదండ్రులు Grazio Forgione and Maria Giuseppa De Nunzio. 

అతను పుట్టిన మరుసటి రోజు  జ్ఞాన స్నానం ఇవ్వబడింది.  పన్నెండేళ్ళ వయసులో  భద్రమైన అభ్యగనం మరియు మొదటి సారి దివ్య సత్ప్రసాదాని స్వీకరించారు.

the life story of saint padre pio in telugu padre pio cause of death padre pio miracles padre pio predictions 2020 padre pio family what is padre pio the patron saint of what is padre pio known for padre pio last words where did padre pio live




జనవరి 3 1903 వ సంవత్సరం తన పదహారేళ్ళ వయసులో  Morcone లోని కాపుచిన్ ఫ్రియర్స్ సభ లో ప్రవేశించి బ్రదర్ పియో గా పేరు మార్చుకున్నారు.
ఆగస్ట్ 10 1910 వ  సంవత్సరం లో బెనెవేంటో నగరంలో గురువుగా అభిషిక్తులు అయ్యారు. కొన్ని అనారోగ్య కారణాల వలన 1916 వ  సంవత్సరం  వరుకు తన కుటుంబం తో పాటు ఇంటి దగ్గరే ఉన్నారు. అదే సంవత్సరం సెప్టెంబరులో అతన్ని శాన్ గియోవన్నీ రోటోండో ఆశ్రమానికి పంపారు మరియు అతను  మరణించే వరకు అక్కడే ఉన్నారు.
అది 1915 సంవత్సరం మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం పాదరే పియో మిలటరీలో సేవలందించడానికి పంపబడ్డారు. అనారోగ్య కారణాల చేత సెలవు మీద పలుమార్లు ఇంటికి వెళ్ళి వచ్చేవారు. చివరకు ఆరోగ్యం సహకరించక పోవడంతో 1916 వ సంవత్సరంలో మిలటరీ సేవ నుండి ఆశ్రమానికి తిరిగి వెళ్లడానికి అనుమతి ఇచ్చారు
1918 వ సంవత్సరంలో  శాన్ గియోవన్నీ రోటోండో ఆశ్రమానికి తిరిగి వచ్చారు..
సెప్టెంబర్ 20 1918 వ సంవత్సరంలో పాదరే పియో సిలువ ముందు మొకరించి ప్రార్ధిస్తుండగా
యేసు క్రీస్తు యొక్క పంచ గాయాలను పొందారు.
వైద్యులు ఆ గాయాలను 5 నెలలపాటు పరీక్షించగా వారికి ఎటువంటి సహజ కారణం కనిపించలేదు కానీ ఆయన మరణం తర్వాత ఆ గాయాలు కనబడలేదు.
the life story of saint padre pio in telugu padre pio cause of death padre pio miracles padre pio predictions 2020 padre pio family what is padre pio the patron saint of what is padre pio known for padre pio last words where did padre pio live




1919 వ ఈ సంవత్సరంలో అనేక పత్రికలు ఆయన పంచ గాయాల గురించి ప్రచురించాయి.
ఈ కారణంగా ప్రజలు ఆయనను చూడడానికి పెద్ద సంఖ్యలో   తరలివచ్చారు. ఈ ప్రజలు పాదరే పియో దగ్గర పాప సంకీర్తన చేసి దివ్య బలి పూజ లో పాల్గొనేవారు. వ్యాధి బాధలతో వచ్చే ప్రజలకు స్వస్థత  పరచి  వారికి మార్గ చూపరిగా వారి సమస్యలకు పరిష్కారాలు చూపించేవారు .ఈ విధంగా ఆయన ఆధ్యాత్మిక గురువు గా ఉండి ఆ ప్రజలను విశ్వాస మార్గంలో నడిపించే వారు.

కానీ  ఆయన చేసిన మంచి పనులు ఆయనకు అనేక సమస్యలను బాధలను తెచ్చిపెట్టాయి. ఆయనకు ఉన్నటువంటి దేవుని యొక్క ప్రత్యేక వరాలు  శ్రీసభలో ఆయనను ఒక వివాదాస్పద  వ్యక్తిగా  నిలబెట్టాయి. ఆయనను దివ్య బలి పూజ చేయడం మరియు పాప సంకీర్తన వినడం నిషేధించారు.
కానీ ఆయన ఇటువంటి కష్ట సమయంలో కూడా  ఆయనపై విధించినటువంటి నిషేధాన్ని విధేయతతో శిరసావహించి మరింత ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపేవారు.
కానీ ప్రభువు ఆయన భక్తులను ఎన్నటికిని చేయి విడువడు.
1933 సంవత్సరములో ఆయనకు దివ్య బలి పూజ నిర్వహించుటకు మరియు పాప సంకీర్తన వినుటకు తిరిగి అనుమతి ఇవ్వబడింది.

మరల పెద్ద సంఖ్యలో విశ్వాసులు దివ్యబలిపూజ లో పాల్గొనడం కోసం మరియు పాప సంకీర్తన చేయటం కోసం వచ్చేవారు.
1940 సంవత్సరములో ఒక హాస్పిటల్ నిర్మించాలని ప్రకటించారు. ఆ హాస్పిటల్ కి Home to relieve suffering అని పేరు పెట్టారు

హాస్పటల్ ని నిర్మించటానికి Barbara Ward అనే బ్రిటిష్ మానవతావాది United Nations Relief and Rehabilitation Administration నుండి నిధులు సమకూర్చాడు. ఈయన సహాయంతో 1956వ సంవత్సరంలో ఈ హాస్పటల్ ప్రారంభించబడింది.

సెప్టెంబర్ 21 1968 వ సంవత్సరం పంచ గాయాలు పొంది 50 సంవత్సరాలు గడిచిన మరుసటి రోజు పాదరే పియో చాలా బలహీనంగా అయిపోయారు. అంత బలహీనతలు కూడా సెప్టెంబర్ 22 1968వ సంవత్సరంలో అతి పెద్ద సంఖ్యలో భక్తుల మధ్య దివ్యబలిపూజ చేశారు ఆ మరుసటి రోజు సెప్టెంబర్ 23 1968 వ సంవత్సరం లో పరలోక భాగ్యం అందుకున్నారు

మే 2 1999 సంవత్సరములో ధన్యత పట్టం ఇవ్వబడింది. జాన్ పాల్ II పొప్ గారు జూన్ 16 2002 సంవత్సరములో పాదరే పియో గారిని పునీతుని గా ప్రకటించారు.

 పాదరే పియో పౌర రక్షణ స్వచ్ఛంద సేవకులకు, కౌమార దశలో వున్న యువతీ యువకులకు పాలక పునీతులు.

For more information please visit our YouTube channel

Post a Comment

0 Comments